డిచ్ పల్లిలో బైక్ ర్యాలీ తీసిన పోలీసులు

by Sridhar Babu |   ( Updated:2021-10-31 00:40:05.0  )
Bike-Rally1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: సర్దార్ వల్లాభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ఉదయం డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఈ బైక్ ర్యాలీని నిజామాబాద్ అదనపు డీసీపీ(అడ్మిన్) ఉషా విశ్వనాధ్ తిరునగరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ నుంచి నడిపల్లి – ధర్మారం మాదవన గర్, బోర్గమ్ బ్రిడ్జి, ఆర్యా నగర్, వినాయక్ నగర్, పూలాంగ్ బ్రిడ్జి, న్యాల్కల్ చౌరస్తా, బడాబజార్, నెహ్రూ పార్క్, చౌరస్తా గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు సాగింది. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. అరవింద్ బాబు ఆధ్వర్యంలో “జాతీయ ఐక్యతదినోత్సవం ” కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లాభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏక్తా దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యాక్రమంలో అదనపు డీసీపీ (ఎ.ఆర్) పి. గిరిరాజు, నిజామాబాద్ ఏసీపీ ఎ. వెంకటేశ్వర్, సీఐలు, ఎస్.హెచ్.ఓలు, ఎస్సైలు, ఇన్స్ పెక్టర్స్ శేఖర్, ఎమ్.టి.ఓ శైలేంధర్, పోలీస్ సిబ్బంది, ఏఆర్ హోం గార్డ్స్ పాల్గొన్నారు.

Advertisement

Next Story