- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోర్టులో సాక్ష్యం చెప్పొదన్న రౌడీ షీటర్.. చంపేస్తాడన్న భయంతో వారేం చేశారంటే.?
దిశ, చార్మినార్: కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని ఒత్తిడి చేయడమే గాకుండా కేసు విత్ డ్రా చేసుకోమని వెంట పడుతున్న రౌడీషీటర్ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ గఫార్ను బహదూర్ పురా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సౌత్ జోన్ డిసిపి గజరావు భూపాల్ వెల్లడించారు. ఇప్పటికే ఈ హత్య కేసులో ఐదుగురుని బహదూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బహదూర్ పురా కు చెందిన మహ్మద్ ఎజాజ్(24) బహదూర్ పురా పోలీస్స్టేషన్లో రౌడీషీటర్. 2020లో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ గఫార్ (35)పై రౌడీషీటర్ మహ్మద్ ఎజాజ్ హత్యాయత్నానికి పాల్పడ్డ కేసు కోర్టులో నడుస్తుంది.
తనకు వ్యతిరేంగా కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని, ఆ కేసు కాంప్రమైజ్ చేసుకోవాలని అబ్దుల్ గఫార్పై రౌడీషీటర్ ఒత్తిడి చేయసాగాడు. దీంతో ఎక్కడ తనను హత్య చేస్తాడోనన్న భయంతో అబ్దుల్ గఫార్ తన తండ్రి మహ్మద్ అబ్దుల్ రఫిక్తో పాటు బంధువులు మహ్మద్ అహ్మదుల్లా, మహ్మద్ ఇనాయతుల్లా, ముంతాజ్ ఆలీఖాన్, సయ్యద్ మహ్మద్ హుస్సేన్లతో కలిసి గత నెల మే 20వ తేదీన రౌడీషీటర్ ఎజాజ్పై ముందుగా కారం కలిపిన నీళ్లను ముఖంపై చల్లారు. అనంతరం కత్తి, కట్టెలతో తీవ్రంగా దాడి చేశారు. గ్రానైట్ రాయితో తల పగులకొట్టి హత్య చేశారు. మృతుడు తల్లి నూర్జహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బహదూర్ పురా పోలీసులు అప్పట్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. రౌడీషీటర్ హత్యకు ప్రధాన కారకుడు అబ్దుల్ గఫార్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును బహదూర్ పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు