ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆ పిల్లలను వదిలిన పోచారం

by Shyam |
ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆ పిల్లలను వదిలిన పోచారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పార్టీలకతీతంగా తెలంగాణ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో.. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో 3.36 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో వంద శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేస్తుందన్నారు. రైతు బీమా, పెట్టుబడి సాయం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పార్టీలకతీతంగా అర్హులందరికీ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపడం కోసం ప్రభుత్వం రాయితీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని పోచారం మరోసారి గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో చేపలను విక్రయించడానికి వాహనాలను రాయితీపై ఇచ్చిందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed