ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ప్రకటన..

by Harish |   ( Updated:2021-08-02 06:16:17.0  )
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను సవరిస్తున్నట్టు ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు పెట్టుబడులుగా పెట్టే ఎఫ్‌డీ డిపాజిట్లపై 0.5 శాతం అదనంగా వడ్డీ రేటును ఇవ్వనున్నట్టు వెల్లడించింది. పీఎన్‌బీ 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 2.9 శాతం నుంచి 5.25 శాతం మధ్య వడ్డీ రేట్లను అందించనున్నట్టు, సవరించిన వడ్డీ రేట్లు ఆగష్టు 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో వివరించింది.

ఒక సంవత్సరం కంటే తక్కువ ఎఫ్‌డీలపై 4.4 శాతం పెరుగుతుంది. సంవత్సరం నుంచి 2 ఏళ్ల వరకు మెచ్యూరిటీ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 5.10 శాతం వడ్డీని అందిస్తోంది. 2-3 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై 5.10 శాతం నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీని పీఎన్‌బీ బ్యాంక్ ఇవ్వనుంది. తక్కువ కాలవ్యవధిని పరిశీలిస్తే.. 7-45 రోజుల మధ్య డిపాజిట్లపై 2.9 శాతం, 46 రోజుల నుంచి 90 రోజుల మధ్య డిపాజిట్లకు 3.25 శాతం, 91-179 రోజుల మధ్య 3.80 శాతం వడ్డీ రేటును బ్యాంకు అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed