- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎన్‌బీలో హౌసింగ్ ఫైనాన్స్ డీహెచ్ఎల్ఎఫ్ మోసం
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్‌కు సంబంధించిన ఖాతాలో మోసం జరిగినట్టు గుర్తించామని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ఆర్‌బీఐకి తెలిపింది. డీహెచ్ఎల్ఎఫ్ తీసుకున్న రుణాల్లో రూ. 3,688 కోట్ల విలువైన రుణాలు మోసపూరితంగా తీసుకున్నారని పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం..నాలుగు త్రైమాసికాల్లో మోసపూరిత ఖాతాలపై వంద శాతం ప్రొవిజనింగ్ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే డీహెచ్ఎల్ఎఫ్ అకౌంట్‌పై ఇప్పటికే రూ. 1,246 కోట్ల ప్రొవిజనింగ్‌ను చేపట్టినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. కాగా, ఇప్పటికే ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ సహా ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ కూడా డీహెచ్ఎఫ్ఎల్ మోసపూరిత ఖాతాలపై చర్యలు తీసుక్టున్నట్టు స్పష్టం చేశాయి. అయితే, భారీ రుణ భారంతో దివాలా కోర్టులకు వెళ్లిన తొలి ఫైనాన్షియల్ కంపెనీగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ మారిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.