- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాని బాకీల రికవరీ చర్యల్లో PNB హౌసింగ్ ఫైనాన్స్..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ గృహ రుణాల సంస్థ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ నెల నుంచి తన బ్యాడ్‌లోన్స్‌ను మెరుగ్గా నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 31తో రుణ గ్రహీతలకు కోర్టు ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చెల్లించే సామర్థ్యం ఉన్నవారి నుంచి రుణాలను చెల్లించమని అడగనున్నట్టు కంపెనీ అధికారి చెప్పారు. ప్రస్తుత ఏడాది జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 6 శాతానికి పెరిగాయి. గతేడాది జూన్ నాటికి ఇది 2.7 శాతంగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది.
కొవిడ్ సెకెండ్ వేవ్ ప్రభావం కారణంగా ఈ పెరుగుదల నమోదైందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఏడాది సెకెండ్ వేవ్ ప్రతికూల ప్రభావం కారణంగా వివిధ కోర్టును రుణ గ్రహీతలు రుణాలు చెల్లించని పక్షంలో చట్టపరమైన లేదంటే పరిపాలన పరమైన చర్యలు తీసుకోవచ్చని సూచించాయి. ఇది ఈ నెలతో ముగిశాక చెల్లింపులను కోరనున్నాం. ఇప్పటికే కొన్ని ఎన్‌పీఏలను తీసుకోగలిగినప్పటికీ, దీన్ని మరింత వేగవంతంగా నిర్వహించాలని కంపెనీ తెలిపింది. జూలైలో దాదాపు 80 కోట్ల విలువైన ఎన్‌పీఏలను నిర్వహించామని, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓ హర్దయాళ్ ప్రసాద్ వెల్లడించారు.