- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రానికి పీఎంజీఎస్‌వై నిధులు రూ. 1084 కోట్లు విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రాష్ట్రానికి రూ. 1084.51 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 194 రోడ్లు, 95 వంతెనల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. 1217.05 కిలోమీటర్ల పరిధిలో 194 రోడ్లు ఉండగా… 6132 మీటర్ల పరిధిలో 95 బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉంది. రోడ్ల నిర్మాణానికి రూ. 800.98 కోట్లు, వంతెనల కోసం రూ. 283.53 కోట్లను కేటాయించారు. దీనిలో రూ. 1020.61 కోట్లు నిర్మాణ పనుల కోసం ఉండగా… రూ. 63.90 కోట్లను ఐదేండ్ల పాటు నిర్వహణ కోసం వెచ్చించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పీఎంజీఎస్వైలో కేంద్రం వాటా 59.27 శాతం కాగా.. రాష్ట్రం వాటా 40.73 శాతంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీఎంజీఎస్‌వై మూడో విడుతలో భాగంగా రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణానికి రూ.445.06 కోట్లు, బ్రిడ్జీల కోసం రూ.161.83 కోట్లు మొత్తం 606.88 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రోడ్ల నిర్మాణానికి రూ.305.95 కోట్లు, వంతెనల కోసం రూ.107.88 కోట్లు చొప్పున విడుదల చేసింది. ఐదేండ్ల పాటు రోడ్ల నిర్వహణకు రూ.50.08 కోట్లు, బ్రిడ్జీల నిర్వహణకు 13.82 కోట్లను కేటాయించినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా జారీ చేసిన జీవోలో వివరించారు.