- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా పరిస్థితులపై పీఎం సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాలు, జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తి వివరాలను అధికారులు పీఎంకు తెలియజేశారు. లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న 12 రాష్ట్రాలపై చర్చించారు. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి మౌలిక సదుపాయాల కల్పనను పెంచే విధానాలను వివరించారు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ నిల్వలు, ఔషధాలు ఏ మేరకు అందుబాటు ఉన్నాయో మోడీ సమీక్షించారు. రెమ్‌డెసివిర్ సహా ఇతర ప్రాణాధార ఔషధాల ఉత్పత్తి వేగాన్ని పెంచినట్టు ప్రధానికి వివరించారు. వ్యాక్సినేషన్ పురోగతిని, టీకా ఉత్పత్తి పెంపు కోసం నిర్ణయించిన చర్యలను పీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, డాక్టర్ హర్షవర్ధన్, పియూష్ గోయల్, మన్‌సుఖ్ మాండవియాలతో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.