సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. లాక్‌డౌన్‌పై చర్చ..?

by Shamantha N |   ( Updated:2021-04-05 06:35:31.0  )
సీఎంలతో ప్రధాని మోడీ భేటీ.. లాక్‌డౌన్‌పై చర్చ..?
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, వ్యాక్సినేషన్ రిలేటెడ్ సమస్యలపై చర్చించనున్నారు. ఇదే సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌పై చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న కారణంగా ఆయా రాష్ట్రాల సీఎంలు లాక్‌డౌన్ విధించారు.

Advertisement

Next Story