- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం : మోడీ
దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించిన తర్వాత బీజేపీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామిని నిలబెట్టుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని.. జమ్మూ కశ్మీర్ పునర్విభజన ప్రక్రియ పూర్తైన వెంటనే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు ఉంటారని స్పష్టంచేశారు. ఇవాళ 74వ స్వాంతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు.
జమ్మూ కశ్మీర్ ఈ ఏడాది అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, శరణార్థులు కూడా గౌరవంగా జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయమని వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు తమతమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ తొందర్లోనే ప్రారంభమవుతుందని, వారు తమ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిని ఎన్నుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మోదీ పనరుద్ఘాటించారు.