పారిస్ ఒప్పంద లక్ష్యాలను దాటేస్తున్నాం : ప్రధాని

by Shamantha N |
పారిస్ ఒప్పంద లక్ష్యాలను దాటేస్తున్నాం : ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ మార్పులపై దృష్టి పెట్టాల్సి ఉన్నదని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం జీ 20 సదస్సులో ఆయన మాట్లాడుతూ..26 మిలియన్ల హెక్టార్ల భూమిని 2030లోపు మళ్లీ ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. అలాగే, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. యావత్ మానవాళి సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా గ్రీనరీ కోసం పాటుపడాలన్నారు.

ప్రకృతితో పెనువేసుకుని జీవించడం భారత జీవన విధానంలో ఉంది. ఈ సంప్రదాయాలను భారత్ సర్కార్ ప్రాథమికంగా కార్బన్ లేని, పర్యావరణహిత అభివృద్ధి మార్గాలను ఎంచుకుంటున్నట్లు వివరించారు. భారత్ కేవలం పారిస్ ఒప్పందంలోని లక్ష్యాలను అందుకోవడమే కాదని, వాటిని దాటి వెళ్తున్నదని వెల్లడించారు. కాగా, యూఎస్, చైనా, యూకే, భారత్, బ్రెజిల్ సహా ఇతర భారీ ఆర్థిక వ్యవస్థల నాయకులతో జరిగే ఈ సదస్సును ఈ ఏడాది సౌదీ అరేబియా వర్చువల్‌గా నిర్వహిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed