మరో కొత్త పథకం ప్రారంభించనున్న మోడీ….

by Anukaran |   ( Updated:2020-09-09 11:23:08.0  )
మరో కొత్త పథకం ప్రారంభించనున్న మోడీ….
X

దిశ వెబ్ డెస్క్:
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్ వై) పథకాన్ని మోడీ డిజిటల్ విధానం ద్వారా గురువారం ప్రారంభించనున్నారు. దీనితో పాటు ఈ-గోపాల యాప్‌లను ఆయన ప్రారంభించనున్నారు. ఆత్మనిర్బర్ ప్యాకేజీ కింద 2020-21 నుంచి2024-25 వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20,050 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పీఎం ఎంఎస్ వై కింద ఇంత పెట్టుబడి పెట్టడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇందులో సుమారు 12,340 కోట్లను మెరైన్, ఇన్ ల్యాండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ రంగాలకు కేటాయించారు. 7710కోట్ల రూపాయలను మత్స్య రంగంలో మౌళిక సదుపాయాల అభివృద్దికి కేటాయించనున్నారు.

కాగా 2024-25 సంవత్సరానికి మత్స్య సంపదను మరో 70లక్షల టన్నులకు పెంచే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అలాగే మత్స్య ఎగుమతుల నుంచి రాబడిని లక్ష కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. మత్స్య రైతుల రాబడిని రెట్టింపు చేసి, పంట అనంతర నష్టాలను 25శాతానికి తగ్గించడం దీని ఉద్దేశ్యం.

Advertisement

Next Story