- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన
దిశ, వెబ్‌డెస్క్: నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12.50 నిమిషాలకు శాస్త్రోక్తంగా మోదీ భూమి పూజ నిర్వహించారు. భూమాత, కూర్మ, వరహారూప, నవగ్రహ, నవరత్న భరిత శిల పూజలు నిర్వహించారు. నవ కలశ స్థాపన తర్వాత శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.971 కోట్ల ఖర్చుతో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్రిభుజకారంలో ఉండే ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మించనున్నారు. లైవ్ కోసం కింద ఉన్న వీడియోపై క్లిక్ చేయండి..