- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని చాటాలి : ప్రధాని
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామ స్ఫూర్తిని ప్రపంచానికి చాటాలని ప్రధాని మోడీ అన్నారు. 75 ఐదవ స్వతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏర్పాటైన కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బాబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..‘75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్వతంత్ర్య సంగ్రామ స్ఫూర్తి, అమరుల త్యాగాలను చాటాలి.
ఇన్నేళ్లలో భారత్ సాధించిన విజయాలనూ అందులో ప్రతిబింభించాలి. అమరవీరులకు నివాళి అర్పిస్తూ కలల భారతాన్ని ఎలా నిర్మించుకోవాలో చాటి చెప్పాలి. 130 కోట్ల మంది ప్రజలను కలుపుకుని ఈ వేడుకలను నిర్వహించుకోవాలి. ఈ వేడుకలకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం..’ అని మోడీ అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. స్వతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీలో వారు కూడా సభ్యులుగా ఉన్నారు.