ప్రధాని తప్పుదారి పట్టిస్తున్నారు : రైతు సంఘాలు

by Shamantha N |
ప్రధాని తప్పుదారి పట్టిస్తున్నారు : రైతు సంఘాలు
X

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళనలకు దిగిన రైతులను తప్పుదారి పట్టించే, విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని రైతు సంఘాలు ఆరోపించాయి. తమపై రాజకీయపార్టీల ప్రభావం లేదని, తమ నిరసనల వెనుక ప్రతిపక్షాలున్నాయన్నది అర్థరహితమని స్పష్టం చేశాయి. తమ వేదికల్లో రాజకీయ పార్టీలకు అవకాశమివ్వలేదని, ప్రభుత్వమే తమ సమస్యను పక్కదారి పట్టించాలని చూస్తున్నదని పేర్కొన్నాయి.

ప్రధానమంత్రి శుక్రవారం రైతుల గురించి చేసిన ప్రసంగంపై ఢిల్లీ సరిహద్దులో ధర్నా చేస్తున్న రైతు సంఘాల నేతలు స్పందించారు. రాజకీయ నేతలనే తమ వేదికపైకి ఎక్కడకుండా బహిష్కరించామని రైతు నేత అభిమన్యు కోహర్ పేర్కొన్నారు. మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తున్నదని, కనీస మద్దతు ధర ఎప్పట్లాగే కొనసాగుతుందని బహిరంగ ప్రసంగాల్లో ప్రధాని తరుచూ పేర్కొంటున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నేత శివ కమార్ కక్కా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed