వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా అవసరం : మోడీ

by Anukaran |
వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా అవసరం : మోడీ
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను లైట్‌గా తీసుకోవద్దని, ఈ మహమ్మారికి మందు వచ్చే వరకు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ప్రధాని మోడీ ప్రజలను కోరారు. కరోనాకు మందు వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలని, భౌతిక దూరం, మాస్కుల ధారణ తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన 1.75లక్షల ఇళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ధర్, గ్వాలియర్‌లకు చెందిన లబ్దిదారులతో ఆయన మాట్లాడుతూ, ఈ సారి దీపావళి, ఇతర పండుగల వేడుకలు మరింత సంబురంగా జరుగుతాయని అన్నారు.

కరోనా లేకుండా ప్రధాన సేవకుడైన తాను లబ్దిదారుల నడుమ ఉండి సంతోషాన్ని పంచుకునే వారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సిందియా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. సంక్షేమపథకాల కింద మధ్యప్రదేశ్ వాసుల అభ్యున్నతికి కొత్తదారులు వేస్తున్న ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు సీఎం చౌహాన్ పేర్కొన్నారు.

Read Also…

అగ్నివేశ్‌పై CBI మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..

Advertisement

Next Story

Most Viewed