మోడీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతంటే..!

by Shamantha N |
మోడీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలను కేంద్రం పార్లమెంటు ముందు పెట్టింది. విపక్ష సభ్యుల కోరిక మేరకు రిపోర్టు రూపంలో అందిజేసినట్లు సెంట్రల్ సర్కార్ ప్రకటించింది. 2015 నుంచి ఇప్పటివరకు మోడీ 58 దేశాల పర్యటనకు వెళ్లిగా.. ఆ పర్యటనలకు మొత్తం రూ. 517 కోట్ల ఖర్చు అయినట్లు పార్లమెంటుకు వివరించింది. రాజ్యసభలోనూ ప్రధాని విదేశీ పర్యటనలపై ప్రశ్నలు తలెత్తగా.. కేంద్రం మంగళవారం వివరణ ఇచ్చింది.

విదేశీ పర్యటనల్లో ప్రధాని అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్లు విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మోడీ విదేశీ పర్యటనకు వెళ్లలేదని.. చివరిగా గతేడాది నవంబర్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లినట్లు ఆయన చెప్పారు. వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి పీఎం విదేశీ పర్యటనలు సహాయపడినట్టు మురళీథరన్ తెలిపారు.

కాగా, 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు మోదీ విదేశీ పర్యటనలకు రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్లు 2018 డిసెంబర్‌లో కేంద్రం వెల్లడించింది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ విదేశీ పర్యటనలపై ఎప్పుటికప్పుడు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed