ఆఫ్ఘన్ టెన్షన్.. ప్రధాని నివాసంలో అత్యవసర భేటీ

by Shamantha N |   ( Updated:2021-08-17 08:37:03.0  )
ఆఫ్ఘన్ టెన్షన్.. ప్రధాని నివాసంలో అత్యవసర భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు వశపరుచుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘన్ పౌరులు తాలిబన్ల చెరలో బంధీలుగా జీవించేందుకు ఇష్టం లేక ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అందుకోసం ఎయిర్ పోర్టుల్లోని రన్ వే లపై పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం అక్కడి అధికారులను, భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.

ఇదే విషయంపై ప్రధాని అధికారిక నివాసంలో మోడీ అత్యవసర సమావేశం నిర్వహణకు ఆదేశించారు. దీనికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా హాజరు కాగా, భారత ప్రభుత్వం తాలిబన్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story