మీ మధ్యలో ఉంటేనే నాకు అసలైన దీపావళి : మోడీ

by Anukaran |   ( Updated:2020-11-14 02:22:29.0  )
మీ మధ్యలో ఉంటేనే నాకు అసలైన దీపావళి : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగను ప్రధాని నరేంద్ర మోడీ దేశ సైనికులతో కలిసి జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ వద్దగల ఆర్మీ పోస్టులో ఉన్న భారత జవాన్లకు మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మీ మధ్యలో ఉంటేనే తనకు అసలైన దీపావళి అని చెప్పుకొచ్చారు.

విధి నిర్వహణలో చనిపోయిన జవాన్లకు తొలుత నివాళులు అర్పించిన మోడీ.. అమరవీరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. సైనికులు సంతోషంగా ఉంటేనే దేశ ప్రజలకు ఏ సంతోషమైనా, పండుగైనా ఉంటుందని మోడీ వివరించారు.నేడు భారత్ ఉగ్రవాదులను మరియు లీడర్లను వారి ఇళ్లలోకి ప్రవేశించి చంపేస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ దేశం తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాజీపడదని ప్రపంచానికి ఇప్పుడు అర్థమైందన్నారు. భారతదేశ ఖ్యాతి, పోటీతత్వం అనేది సైనికుల శౌర్యం కారణంగానే ఇంకా నిలిచి ఉందన్నారు.ఈ వేడుకల్లో ప్రధాని మోడీ వెంట త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే కూడా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed