- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చౌహాన్ మృతి పట్ల ప్రధాని సంతాపం
దిశ, వెబ్‌డెస్క్ : భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు చేతన్ చౌహాన్ మృతి పట్లప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. చౌహాన్‌ను సమర్ధత కలిగిన రాజకీయ నేతగా ఆయన అభివర్ణించారు. ప్రజాసేవలో ఎంతో చరుకుగా పనిచేసి, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పటిష్టతకు కృషి చేశారని కొనియాడారు.
‘చేతన్ చౌహాన్ అద్భుతమైన క్రికెటర్‌గా కెరీర్ సాగించడమే కాకుండా, ఆ తర్వాత చురుకైన రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ప్రజాసేవలో నిమగ్నమై, యూపీలో బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాటుపడ్డారు. చౌహాన్ ఇక లేరనే విషయం ఆవేదనకు గురిచేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఆదివారం హర్యానాలోని గురుగావ్‌లో 73 ఏళ్ల చేతన్ చౌహాన్ కన్నుమూశారు. కరోనా చికిత్సకోసం మేదాంత ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ ప్రాణాలు వదిలారు.