మా నాన్నను వదిలిపెట్టండి అంకుల్ ప్లీజ్.. జవాన్ కూతురు కన్నీరు

by Shyam |   ( Updated:2023-12-16 15:09:18.0  )
మా నాన్నను వదిలిపెట్టండి అంకుల్ ప్లీజ్.. జవాన్ కూతురు కన్నీరు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్ కాల్పుల ఘటన తర్వాత మావోయిస్టులు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్‌ని తమ వెంట తీసుకెళ్లారు. ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్ జర్నలిస్ట్‌లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. అతని కుటుంబ సభ్యులు రాకేష్ సింగ్ బ్రతికే ఉన్నాడన్న సంతోషం కన్నా ఎక్కువగా అతన్ని వదిలిపెడ్తారా లేదా అన్న భయమే ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నది. ఈ సందర్భంగా రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేరే పప్పాకు చోడ్ దే అంటూ కన్నీరు మున్నిరుగా ఆ చిన్నారి ఏడుస్తూ మాట్లాడిన వీడియో అందరిని కంటతడిపెట్టిస్తోంది

Advertisement

Next Story

Most Viewed