- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి
దిశ, భువనగిరి రూరల్ : మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జడ్పీటీసీ గోలీ ప్రణీత పింగల్ రెడ్డి అన్నారు. నాలుగోవిడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ పట్టణంలోని ప్రతి ఇంటికి 6 మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ మనుగడకు చెట్ల అవసరమైన వనరని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించినప్పుడే భావితరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలిగనవారమవుతామన్నారు.
అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటినుండే మొక్కలు పెంచేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జిల్లా బీబీనగర్ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘము జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎండీ దస్తగిరి, వార్డు సభ్యులు అంజి పొట్ట, బెండ ప్రవీణ్, శ్యామల వేణు, రొడ్డ యమున తదితరులు పాల్గొన్నారు.