- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మ ఎమ్మెల్సీ బరిలో.. కూతురు గోవా క్యాంపులో
దిశ , గుండాల : ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తన తల్లి కోండ్రు సుధారాణి పోటీలో ఉండగా ఆమె కూతురైన ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి, టీఆర్ఎస్ ఎంపీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు గెలుపులో భాగంగా గోవా క్యాంప్‌కి వెళ్లారు. కూతురి గోవా క్యాంప్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆదివాసీ సంక్షేమమే ధ్యేయంగా ఆదివాసీ సమస్యల పరిష్కారం కోసం 70 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుధారాణి పోటీలో ఉన్నారు. ఖమ్మం తో పాటు ఆమె ఆదిలాబాద్‌లో కూడా పోటీ చేశారు.
ప్రధానంగా గిరిజన చట్టాల అమలు తో పాటు 5వ షెడ్యూల్ భూభాగంలో ప్రభుత్వం ఆదివాసీలను తరిమి వేయాలనే ఉద్దేశంతో ఖనిజ సంపదను దోచుకోవాలని లక్ష్యంతో ఆదివాసీలను అడవి నుంచి దూరం చేయాలని దృక్పదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. అందుకు భిన్నంగా ఆదివాసి సంక్షేమమే ధ్యేయంగా వారి అభ్యున్నతి కోసమే తాను పోటీ చేస్తున్నానని, ఖమ్మం జిల్లాలో 400 మంది ఆదివాసి ఎంపీటీసీలు గెలుపొందారని తెలియజేశారు. ఆదివాసి రిజర్వేషన్‌తో గెలుపొందిన ఆదివాసీలు నిబద్ధతతో నిజాయితీతో తనకు ఓటేస్తే తాను గెలుస్తానని తెలిపారు. కాగా ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వామపక్షాలు కూడా వారి పార్టీ నుండి గెలుపొందిన ఎం పీ టీ సీ, జడ్పీ టీసీ తనకు ఇవ్వాలని సుధారాణి వేడుకుంది. వామపక్షాలు ఆదివాసి అభ్యర్థికి ఓటు వేయాలని ఆమె కోరారు.