- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకు సౌకర్యాలు కల్పించాలని హైకోర్టులో పిల్
దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా వైరస్ మరింత వ్యాపిస్తున్న నేపథ్యంలో పోలీసులకు, హోం గార్డులకు సరైన రక్షణ సౌకర్యాలను కల్పించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. కరోనా బాధిత ప్రతి పోలీస్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది రాపోలు భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 40 వేల మంది పోలీసులతో పాటు మరో 20 వేల మంది హోం గార్డులు పనిచేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జనాభాకు అనుగుణంగా పోలీసులు లేనందున వెంటనే పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసులు, హోంగార్డులకు 50 శాతం వేతనాలతో పాటు బోనస్ ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. అంతే కాకుండా, కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ సిబ్బందికి పీపీఈ కిట్లను, ఎన్-95 మాస్క్‌లను, శానిటైజర్లు, బ్లౌజులు, హెల్మెట్లతో పాటు మెడికల్ కిట్లు అందజేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలన్నారు.