ప్లీనరీని విజయవంతం చేయండి : పిడమర్తి రవి

by Sridhar Babu |
ravi
X

దిశ, కల్లూరు: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రేపటికి(25.10.2021) 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ Hitex నందు నిర్వహించనున్న ప్లీనరీ ని విజయవంతం చేయాలని, కోరుతూ TRS పార్టీ నాయకులను విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ యూత్ సెక్రటరీ యాసా శ్రీకాంత్ నివాసంలో డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. కేసీఆర్ 20 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రిగా ఉంటారు అని తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం కేసీఆర్ కి మాత్రమే ఉన్నదని, దళిత బంధు సీఎం కేసీఆర్ చేయగలరని అన్నారు.

పేద ప్రజలకు అందుతుందని ఆసరా పింఛన్లు, రైతుబంధు, అందిస్తున్న ఆరాధ్య దేవుడు మన కేసీఆర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాసా శ్రీకాంత్, మాగంటి ప్రభాకర్, మాదిగ జేఏసి అధ్యక్షులు మత్తే గోపాల్ , జిల్లా యశ్వంత్, బసవ కిషోర్, బానోత్ కృష్ణ, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాదర్, మరియు ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story