- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ అందాలన్నీ నాకు దేవుడిచ్చిన గిఫ్ట్.. స్టార్ మోడల్
దిశ, సినిమా : స్లోవేకియాకు చెందిన సెక్సీ మోడల్ వెరోనికా తన బ్యూటీ కష్టాలపై స్పందించింది. ఇన్‌స్టాలో 11 లక్షల మంది ఫాలోవర్స్‌ను మెయింటైన్ చేస్తున్న వెరోనికా, లేటెస్ట్ ఇంటర్వ్యూలో అందంపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘అమ్మాయి అందంగా ఉంటే అందరూ మెచ్చుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం పూర్తి విరుద్ధం. నా అందాన్ని నమ్మని.. భరించలేని ప్రత్యర్థులు, యూజర్లు కావాలనే నా ఇన్‌స్టా అకౌంట్ డిలీట్ అయ్యేలా చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు నన్ను ఏఐ రోబోగా భావిస్తూ గ్రహాంతరవాసిగా పిలుస్తున్నారు. ఫొటోలను స్టన్నింగ్ పిక్స్‌గా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నావంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక 2016లో మిస్ స్లోవేకియా కిరీటం దక్కించుకున్నపుడు కూడా చాలా మంది ఇతర మహిళలు తిట్టిపోశారని చెప్పింది. సాటి మహిళలే ఎక్కువ గాయపరుస్తారన్న ఆమె.. ఇంకా కొందరు ప్లాస్టిక్ సర్జరీతో పాటు బ్రెస్ట్ ఇంప్లాట్స్ చేయించుకున్నట్లు ఆరోపిస్తున్నారని, కానీ అది నిజం కాదని చెప్పింది. ఇక తనది సహజ అందమే అని నిరూపించేందుకు దుబాయ్‌లో డాక్టర్ దగ్గరకు వెళ్తే అతను కూడా నమ్మలేదని, చెకప్ చేసిన తర్వాత నిజమేనని ఆశ్చర్యపోయాడని చెప్పింది. ఈ అందాలన్నీ తనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్‌గా పేర్కొన్న వెరోనికా.. అందం అనేది ఓ భావన మాత్రమే తప్ప శాశ్వతమైనది కాదని, మీరు అందంగా ఉన్నారని భావిస్తే ఎలా ఉన్నా అందంగా ఉన్నట్లేనని వివరించింది.
డ్యాన్స్‌తో ఇరగదీసిన అలనాటి అందాల భామ.. ఎందుకో తెలుసా?