Unstoppable Season 2 : ఒకే వేదికపై పవర్ స్టార్, నటసింహం.. గెటప్ అదుర్స్

by Admin |   ( Updated:2023-01-21 13:48:41.0  )
Unstoppable Season 2 : ఒకే వేదికపై పవర్ స్టార్, నటసింహం.. గెటప్ అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. తాజాగా.. ఆ కోరిక నెరవేరింది. బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ ఎపిసోడ్‌కు షూటింగ్‌‌లో మంగళవారం పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్వీట్లు, కామెంట్లతో మెగా,నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.







Advertisement

Next Story