నెల రోజుల్లో రూ.200కోట్ల మార్క్ అందుకున్న PhonePe

by Harish |
PhonePe
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ phonepe అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.200కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. ఇది ఒక నెలలో ఎన్నడూ లేనంత అత్యధికం. 47 శాతం వాటాతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు అగ్రగామిగా ఉన్నాయి. ఈ సందర్భంగా PhonePe వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ.. గత నెల PhonePeలో అసాధారణమైన, అత్యధిక లావాదేవీలను నమోదు చేశామని ప్రకటించారు. భారతదేశపు ప్రముఖ చెల్లింపుల వేదికగా స్థానాన్ని సుస్థిరం చేశామని, మా లావాదేవీలలో 80 శాతం టైర్ II, III నగరాలు నుంచి వచ్చాయని తెలిపారు. డిజిటల్ చెల్లింపులు దేశం అంతటా వ్యాపించాయని చెప్పారు.

వీటిలో విద్యుత్, గ్యాస్, DTH, బీమా, రుణ చెల్లింపులు, ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, పోస్ట్-పెయిడ్ మొబైల్ బిల్లులు, కేబుల్ బిల్‌లు మెుదలగునవి ఉన్నాయని పేర్కొన్నారు. కరోన ప్రభావంతో ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపారని వివరించారు.

దీంతో కరోనా మహమ్మారి కారణంగా లావాదేవీలు విపరీతమైన వృద్ధిని సాధించాయని, ప్రజలు ఇంట్లోనే ఉండి తమ రోజువారీ అవసరాల కోసం నగదు రహిత చెల్లింపులు చేయవలసి వచ్చిందని అభిప్రాయపడ్డారు. మొదటి లాక్‌డౌన్ తర్వాత, PhonePe మరింత ఆదరణ పొందిందని వెల్లడించారు. డిసెంబర్ 2020లో Google Payని అధిగమించి భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే కంపెనీ ఒక మిలియన్ లావాదేవీల మార్కును దాటిందని, 145 మిలియన్లకు పైగా నెలవారీ క్రియాశీల వినియోగదారులను, $600 బిలియన్ల వార్షిక మొత్తం చెల్లింపుల విలువలను నమోదు చేసిందని సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు.

Advertisement

Next Story