ఫోన్‌పే సరికొత్త పాలసీ..'కరోనా కేర్'!

by Harish |
ఫోన్‌పే సరికొత్త పాలసీ..కరోనా కేర్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 బాధితుల కోసం దేశీయ డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే గుడ్‌న్యూస్ ప్రకటించింది. ఈ పాలసీని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం ద్వారా ఈ పాలసీలని ఆవిష్కరించింది. ఈ పాలసీకి ‘కరోనా కేర్’ అని పేరు పెట్టింది. ఈ పాలసీ ప్రీమియం రూ. 156గా నిర్ణయించారు. మొత్తం ఈ బీమా కవరేజీ ద్వారా రూ. 50,000 వరకూ లభిస్తుందని తెలిపింది. ఈ పాలసీ 55 ఏళ్లలోపు వారికి వర్తిస్తుంది. కొవిడ్-19 సోకిన వారికి చికిత్స అందిస్తున్న అన్ని ఆసుపత్రులలో ఈ పాలసీ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. కరోనా వైరస్ చికిత్స వరకే కాకుండా హాస్పిటలైజేషన్‌కు నెల రోజుల ముందు వరకూ అయిన ఖర్చులన్నీ ఈ పాలసీ కిందకు వస్తాయి. ఫోన్‌పే నుంచి ఈ పాలసీని సులభంగా పొందవచ్చు. కేవలం రెండు నిమిషాల్లో ఈ పలసీ ప్రక్రియ పూర్తవుతుందని ఫోన్‌పే తెలిపింది. దీనికి సంబంధించిన పత్రాలు తక్షనమే వచ్చేస్తాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఫోన్‌పే ఫౌండర్, సీఈవో సమీర్…కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. అంతర్జాతీయంగా అనేక దేశాలు దీని బారినపడ్డాయి. కొవిడ్-19ను నిలువరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ ఇండియాలో వ్యాప్తిని నిలువరించగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమందికి ఆరోగ్య రక్షణ బీమా లేవు. కొవిడ్-19 వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదురైతే కుటుంబంపై ఆర్థిక భారం ఎక్కువవుతుంది. దీనికోసమే ఈ పాలసీని తీసుకొచ్చామని ఆయన వివరించారు.

Tags : PhonePe, Insurance, life insurance policy

Advertisement

Next Story

Most Viewed