ఈ నెల 6న పీజీఈసెట్ నోటిఫికేషన్

by Shyam |
ఈ నెల 6న పీజీఈసెట్ నోటిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీజీఈసెట్ 2021 నోటిఫికేషన్ ను ఈనెల 6న విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. జూన్ 19 నుంచి 22 వరకు కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ రెండు సెసెన్స్ లో నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 12 నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరించనుండగా చివరి తేదీ ఏప్రిల్ 30గా ప్రకటించారు. అప్లికేషన్ ధర జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500గా నిర్ణయించారు. జూన్ 15 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు స్వీకరిస్తారు. హాల్ టికెట్లను జూన్ 10 నుంచి 18 వరకు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు 120 ప్రశ్నలను 2గంటల్లో సమాధానం ఇవ్వాలి. పూర్తి వివరాల కోసం www.tsche.ac.in వెబ్ సైట్ ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Advertisement

Next Story