- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం డిపోలో హమాలీ పోస్ట్.. పోటీపడుతున్న పీజీ విద్యార్థులు!
దిశ, నాగర్‌కర్నూల్ : రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటనే ఉదాహారణ. డిగ్రీలు, పీజీలు చదివిన పట్టభద్రులు హమాలీ పోస్ట్ కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేదని, ఈ పోస్టైనా ఇప్పించి ఆదుకోవాలని ఏకంగా జిల్లా కలెక్టర్‌కు మొర పెట్టుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిమ్మాజిపేట మండలం మద్యం డిపోలో హమాలీ పోస్ట్ ఖాళీ అయింది. దీనిని స్థానికులకే ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో డిగ్రీలు, పీజీలు చేసిన నిరుద్యోగులు సైతం మద్యం గోదాం ఐఎంఎల్ డిపోలో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారికి రాకుండా టీఆర్ఎస్ నేతలు ఆ ఉద్యోగాలు పొందేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తూ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక ఖాళీగా ఉన్నామని, ఈ ఉద్యోగమైనా ఇప్పించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా అవకాశం ఇస్తామని చెప్పుకుంటూ వస్తున్న మేనేజర్ ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య అనుచరులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆరోపించారు. దీనికోసం ఒక్కో వ్యక్తి దగ్గర రూ.50 నుంచి రూ.80 వేల వరకు వసూలు చేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని, కనీసం మద్యం దుకాణాల్లోనైనా హమాలీ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.