- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16వ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. వరుసగా 16వ రోజూ పెట్రోలియం సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌కు 33పైసలు, డీజిల్ 58పైసలు పెంచాయి. దీంతో గత 16 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.8.30, డీజిల్‌పై రూ.9.46 పెరిగింది. చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసిన తర్వాత పక్షం రోజుల్లో ఈ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.79.56, డీజిల్ రూ.78.55, ముంబయిలో పెట్రోల్ 86.04, డీజిల్ 77.24, హైదరాబాద్‌లో పెట్రోల్ 82.59, డీజిల్ 77.06, విజయవాడలో పెట్రోల్ 82.62, డీజిల్ 77.08, బెంగళూరులో పెట్రోల్ రూ.82.15, డీజిల్ 74.98కు చేరుకున్నాయి.
2012, ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒక్కసారి ధరల పెంపుపై ఇంధన సంస్థలు సమీక్షించి పెంచడం లేదా తగ్గించేవి. అయితే, 2017, మార్చి నుంచి రోజు వారీగా ఇంధన ధరల పెంపుపై సమీక్ష చేస్తున్నాయి. ఈ నెల 7 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. నియంత్రణ ఎత్తివేసిన 15 రోజుల్లోనే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. గతంలో 15 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా రూ. 4 నుంచి 5 కంటే ఎక్కువగా పెరిగిన దాఖలాలు లేవు. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటా అత్యధికంగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.56 ఉండగా, ఇందులో రూ.50.69 లేదా 64 శాతం పన్నులే ఉన్నాయి. ఇందులో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.32.98, వ్యాట్ రూ.17.71గా ఉన్నాయి. లీటర్ డీజిల్ రూ.78.55(ఢిల్లీలో)లకు విక్రయిస్తుండగా, ఇందులో 63 శాతం లేదా 49.43 ట్యాక్సులే ఉండటం గమనార్హం. ఇందులో సెంట్రల్ ఎక్సై్‌జ్ డ్యూటీ రూ.32.98, వ్యాట్ 17.60గా ఉన్నది.