వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

by Anukaran |
వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్‌పై మరోసారి ధరలను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.106.89కు చేరుకోగా.. డీజిల్​ ధర రూ.95.63కు పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.14కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర 38 పైసలు పెరిగి లీటర్​డీజిల్ ధర రూ.104.28కి చేరింది.

Advertisement

Next Story