- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫీల్డ్ అసిస్టెంట్లను ఎలా తొలగిస్తారు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో 7,747మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005యాక్ట్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని, గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఐఎన్‌టీయూసీ ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ పిటిషన్ వేశారు.
ప్రధానంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడాన్ని ఉద్యోగులు సవాలు చేస్తూ, తొలగించిన దాదాపు 8వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతం చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ తరపు సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. పిటిషన్‌పై ప్రభుత్వ తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.