కారుణ్య మరణాలకు అనుమతివ్వండి

by Sumithra |
కారుణ్య మరణాలకు అనుమతివ్వండి
X

దిశ, క్రైమ్ బ్యూరో : పీఈటీ ఉద్యోగాలకు ఎంపికైన తమకు పోస్టింగులు ఇవ్వాలని గురుకులాల పీఈటీ అభ్యర్థులు సోమవారం ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేడియంకు తరలించారు. అయితే, తమ సమస్య పరిష్కరించే దాకా కదిలే ప్రసక్తే లేదంటూ వారు బైఠాయించారు. అనంతరం పీఈటీ అభ్యర్థులు భారతీ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ ద్వారా 2017లో గురుకులాలకు చెందిన 616 పీఈటీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా డిగ్రీ, బీపీఈడీ పూర్తి చేసిన వారు ఎంపికైనట్లు తెలిపారు.

అయితే, అండర్ గ్రాడ్యుయేషన్ ద్వారా వ్యాయామ విద్యలో డిప్లోమా కోర్సు చేసిన వారు కోర్టును ఆశ్రయించారు. ఆ అంశం గత నాలుగేండ్లుగా కోర్టులో నలుగుతోంది. దీంతో ఉద్యోగాలు వచ్చినా పోస్టింగులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని మంత్రలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవి కాలం ముగుస్తున్నా.. తమకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. ఈ సారి న్యాయం జరిగే వరకూ హైదరాబాద్ నుంచి కదిలే ప్రసక్తే లేదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగాలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆత్మహత్యలు చేసుకునేందుకు అనుమతులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed