తక్కువ వడ్డీకి రుణాలిచ్చే బ్యాంకులు ఇవే..

by Anukaran |   ( Updated:2021-07-16 01:27:30.0  )
Personal Loan Interest rates
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమయంలో ఎంత సంపాదించిన నెల చివరి వరకు మిగులు అనేదే లేకుండా పోతుంది. ఇక ఈ సమయాలల్లో ఏమైన ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినట్టతై మనకు తెలిసినవారి దగ్గర అధిక వడ్డీకి అప్పుగా తీసుకుంటాము. దీంతో వడ్డీ అనేది ఎక్కువ అవుతోంది.

అందుకోసమే చాలా మంది బ్యాంకులలో లోన్స్ కోసం చూస్తుంటారు. కానీ చాలా వరకు బ్యాంకులు తమకు ఉన్న నియమ నిబంధనల ప్రకారం వీరు అర్హులు అనే వారికి మాత్రమే లోన్‌లు ఇస్తుంటాయి. మరికొన్ని బ్యాంకులు భూమి తాకట్టుపెట్టుకొనో లేదా, బంగారం తాకట్టు పెట్టుకొనో లోన్‌లు ఇస్తుంటాయి.

అయితే ఎలాంటి ఆస్తి పత్రాలు, బంగారం తీసుకోకుండా రుణాలు ఇచ్చే బ్యాంకులు ఉన్నాయి. అదేలా సాధ్యం అనుకుంటున్నారా.. పర్సనల్ లోన్స్ గురించి చాలా మందికే తెలిసి ఉంటుంది. పర్సనల్ లోన్స్ ప్రస్తుతం చాలా బ్యాంకులే ఇస్తున్నాయి. తక్కువ వడ్డీతో బ్యాంకులు పర్సనల్ లోన్స్ ప్రోవైడ్ చేస్తున్నాయి. కానీ ఈ పర్సనల్ లోన్స్ కు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి.

పర్సనల్ లోన్ అర్హతలు…

  1. పర్సనల్ లోన్ రావాలంటే క్రెడిట్ స్కోర్ బాగుండాలి.. అంటే కనీసం 750 పాయింట్లకు పైగా ఉంటే పర్సనల్ లోన్ లభిస్తుంది

  2. ఎదైనా ఉద్యోగం చేస్తూ .. జీతం 25 వేలకు పైగా ఉండాలి, ఆ కంపెనీలోనే కనీసం ఆరు నెలలు పనిచేసి ఉండాలి.

  3. క్రెడిట్, డెబిట్ వివరాలను బ్యాంక్ అధికారులు పరిగణలోకి తీసుకుంటారు.

  4. కరెంటు బిల్లు, బ్యాంక్ స్టేట్ మెంట్, గ్యాస్ బిల్లు లాంటి ఫర్ఫెక్ట్ డాక్యుమెంటషన్ ఉండాలి, వాటిని బ్యాంకు అధికారులు చెక్ చేసి దాని బట్టి పర్సనల్ లోన్ ఇస్తారు.

అతి తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్స్ ఇచ్చే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. పైన చెప్పిన విధంగా అన్ని అర్హతలు ఉండి పర్సనల్ లోన్ కావాలి అనుకునే వారు ఈ బ్యాంకులోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేసుకోండి.

తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ ఇచ్చే బ్యాంకులు..

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… వడ్డీ రేటు 8.90 శాతం

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్… వడ్డీ రేటు 8.90 శాతం

  • పంజాబ్ నేషనల్ బ్యాంకు… వడ్డీ రేటు 8.95 శాతం

  • ఇండియన్ బ్యాంకు… వడ్డీ రేటు 9.05 శాతం

  • పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు… వడ్డీ రేటు 9.50 శాతం

  • IDBI బ్యాంకు… వడ్డీ రేటు 9.50 శాతం

  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర… వడ్డీ రేటు 9.55 శాతం

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా… వడ్డీ రేటు 9.60 శాతం

  • యూకో బ్యాంకు… వడ్డీ రేటు10.30 శాతం

  • బ్యాంక్ ఆఫ్ బరోడా… వడ్డీ రేటు 10.50 శాతం

Advertisement

Next Story