- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాగులో ఈతకెళ్లి మూడు రోజులైంది.. నేటికీ తిరిగిరాలేదు.. అసలేమైంది..?
దిశ, ముధోల్ : ఈతకు వెళ్లిన వ్యక్తి మూడు రోజులు అయినా ఇంకా తిరిగి రాని ఘటన ముధోల్ తాలూకా బైంసా పట్టణంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బైంసా గడ్డేన్నవాగు జలాశయంలో శనివారం ఉదయం ఒడ్డు పై ద్విచక్ర వాహనాన్ని నిలిపి, దుస్తులు, చెప్పులు వదిలి బైంసా భట్టి గల్లీకి చెందిన తిప్పొల్ల సాయినాథ్(36) ఈత కొట్టేందుకు అని వెళ్లాడు. కానీ ఇంత వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. ఒడ్డున ఉన్న బట్టలు చూసిన పోలీసులు స్థానిక సీసీ ఫుటేజ్‌ను ఆదివారం పరిశీలించగా సాయినాథ్ ఈత కొడుతూ వెళ్లినట్టు అందులో రికార్డు అయ్యింది. సోమవారం రాత్రి వరకు కూడా సాయినాథ్ ఆచూకీ లభ్యం కాలేదు.
గజ ఈతగాళ్లు రెండ్రోజుల నుంచి అతని కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. సోమవారం సాయంత్రం బాసర మండల కేంద్రానికి చెందిన గజ ఈతగాళ్లు కూడా మరపడవతో సాయంతో గడ్డేన్నవాగులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకూ సాయినాథ్ బతికే ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు అని కుటుంబ సభ్యులు, బంధువులు రెండ్రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు.