- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే మహిళతో ఇద్దరి అక్రమ సంబంధం.. కత్తులతో నరికి..!
దిశ, చార్మినార్ : ఫలక్‌నుమాలో సంచలనం సృష్టించిన షేక్అబ్బాస్హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు స్థానిక పోలీసులు ఛేదించారు. తాను సంబంధం పెట్టుకున్న మహిళతోనే షేక్ అబ్బాస్ కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న నెపంతో అతనిపై కత్తితో దాడి చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు యువకులను ఫలక్‌నుమా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సీఐ దేవేందర్కథనం ప్రకారం.. గుల్జార్నగర్మదీనా మసీదు ప్రాంతానికి చెందిన షేక్ అబ్బాస్(22) జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఎలక్ర్టిషన్ గా విధులు నిర్వహించేవాడు.
షేక్అబ్బాస్కు మూడు నెలల కిందట ఓ యువతితో వివాహం జరిగింది. ఈ నెల 1న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అబ్బాస్ఫోన్ వచ్చిందని ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. కేవలం10 నిమిషాల వ్యవధిలోనే అతనిపై కత్తులతో దాడి చేశారని కుటుంబ సభ్యులకు తెలిసింది. తీవ్రంగా గాయపడిన అబ్బాస్చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుని తల్లి ఖాదర్‌బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా అచ్చిరెడ్డి నగర్‌కు చెందిన మహ్మద్పర్వేజ్(23), నవాబ్‌సాహెబ్‌కుంటకు చెందిన షేక్ అక్రమ్ (24)లు షేక్అబ్బాస్పై కత్తితో దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.
వివాహేతర సంబంధమే కారణం..
నిందితుడు మహ్మద్పర్వేజ్కు గత ఏడేండ్లుగా ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా మృతుడు షేక్అబ్బాస్ కూడా సదరు మహిళతోనే 18 నెలల నుంచి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మహిళతో షేక్అబ్బాస్సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని మహ్మద్పర్వేజ్కొంతకాలంగా గమనిస్తూ వచ్చాడు. అబ్బాస్‌తో దూరంగా ఉండాలని మహిళను మహ్మద్పర్వేజ్హెచ్చరించాడు. వారిద్దరి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో షేక్అబ్బాస్ను ఎలాగైనా మట్టుబెట్టాలని షేక్అక్రమ్తో కలిసి హత్యకు కుట్రపన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి షేక్అబ్బాస్కు ఫోన్‌చేసిన మహ్మద్పర్వేజ్, షేక్అక్రమ్లు ఇంటి నుంచి బయటికి రాగానే ఓ కిరాణా జనరల్ స్టోర్వద్ద అడ్డగించి కత్తులతో దాడి చేసి పరారైనట్టు విచారణలో తేలింది.