జూమ్‌లో సీరియస్ మీటింగ్.. లైవ్‌లో శృంగారం సీన్!

by  |
జూమ్‌లో సీరియస్ మీటింగ్.. లైవ్‌లో శృంగారం సీన్!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రపంచానికి పరిచయం అయ్యాక అంతా ఆన్‌లైన్ మయం అయిపోయింది.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ ఇచ్చేశాయి. అవకాశాన్ని బట్టి ఆన్‌లైన్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఇక విద్యార్థులు కూడా ఆన్‌లైన్ క్లాసుల్లో బిజీబిజీ అయిపోయారు.. జూమ్, గూగుల్ మీట్ ఇలా కొన్ని యాప్‌లను ఆన్‌లైన్ సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వీటినే ఫాలో అవుతున్నాయి.

అయితే, తాజాగా జూమ్ యాప్‌లో ఓ సమావేశానికి సంబంధించి కీలక అంశాల గురించి సీరియస్‌గా చర్చిస్తున్నారు. ఈ సమయంలో.. ఓ ఉద్యోగి శృంగారంలో మునిగిపోయాడు. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే.. లైవ్‌లో రాసలీలల్లో మునిగితేలాడు. తాను చేసే పని లైవ్ రికార్డు అవుతుందని తెలీకుండా సెక్స్ తెగ ఎంజాయ్ చేశాడు.. ఆ దృశ్యాలను లైవ్‌లో చూసిన కౌన్సిలర్లు, అధికారులు షాక్ తిన్నారు.

వివరాల్లోకివెళితే.. బ్రెజిల్‌లోని రియో డి జెనిరో మున్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు స్థానిక సమస్యలపై చర్చించేందుకు జూమ్ వీడియో మీటింగ్‌లో సమావేశమయ్యారు. ఇందులో కరోనా సందర్భంగా విద్యార్థులకు ఆహార, వసతి సదుపాయాల గురించి సీరియస్‌గా చర్చిస్తున్నారు. ఇంతలో ఓ ఉద్యోగి సమావేశాన్ని పట్టించుకోకుండా.. బెడ్‌పై ఓ యువతితో సెక్స్ చేయడం ప్రారంభించాడు.ఇదంతా ఆ మీటింగ్‌లో ఉన్న కౌన్సిలర్లు, ఛైర్మన్‌కు లైవ్‌లో కనిపిస్తోంది. మీటింగ్‌ను పట్టించుకోకుండా ఆ ఉద్యోగి తనపని కానిచ్చాడు. దీంతో షాకైన ఛైర్మన్.. ఆ వ్యక్తి వివరాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. చివరకు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉండగా.. సదరు వీడియో మాత్రం అక్కడ వైరల్ అయ్యింది.


Next Story

Most Viewed