బర్త్ డే కేక్ కట్ చేసినందుకు అరెస్ట్

by Sumithra |   ( Updated:2021-01-15 08:13:56.0  )
బర్త్ డే కేక్ కట్ చేసినందుకు అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: వారంతా జోరు మీద ఉన్నారు..స్నేహితుని పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగా‌నే దోస్తులంతా కలిసి పుట్టిన రోజు ఘనంగా నిర్వహించారు. స్నేహితునితో కేక్ కట్ చేయించి ఆ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కానీ కేక్ కటింగ్ వారిని కటకటాల వెనకకు నెట్టింది. అదేంటి కేక్ కటింగ్ చేస్తే అరెస్ట్ ఏంటి అనుకుంటున్నారా…అయితే ఈ స్టోరీ చదవండి.

అది ఉత్తర ప్రదేశ్‌‌లోని హాపూర్. అక్కడ ఓ బర్త్ డే పార్టీ నడుస్తోంది. చుట్టూ స్నేహితులతో సందడిగా ఉంది. వారి మధ్యలో ఓ టెబుల్ పై బర్త్ డే కేక్ రెడీగా ఉంది. కేక్ కటింగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎరుపు రంగు షర్ట్ ధరించిన వ్యక్తి వచ్చాడు. తన జేబులో ఉన్న పిస్టల్ తీశాడు. వెంటనే పిస్టల్‌తో కేకును కట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ ఆనంద క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ వీడియో కాస్త పోలీసులు దృష్టికి వెళ్లింది. వెంటనే బర్త్ డే పార్టీ చేసుకున్న షానవాజ్ అనే వ్యక్తిని, అతని స్నేహితుడు షాకిబ్ లను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story