గ్రామాల్లో సాయంత్రం 6 వరకు అనుమతులు

by Shyam |

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల పారిశ్రామిక, కార్మిక కార్యకలాపాలకు సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రకటించారు. అయితే, కొవిడ్ -19 మార్గదర్శక సూత్రాలను అనుసరించి సామాజిక దూరం, శానిటేషన్ తదితర జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా స్టోన్ క్రషింగ్, ఇటుకల తయారీ, చేనేత మగ్గాల నిర్వహణ, మరమ్మతుల వర్క్ షాప్‌లు, బీడీల తయారీ, ఇసుక మైనింగ్, సిరామిక్ టైల్స్, రూఫ్ టైల్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు, జిన్నింగ్ మిల్లులు, ఐరన్, స్టీల్ ఇండస్ట్రీలు, ప్లాస్టిక్ శానిటరీ పైపుల తయారీ, పేపర్ ఇండస్ట్రీ, కాటన్ పరుపుల తయారీ, ప్లాస్టిక్ రబ్బర్ ఇండస్ట్రీ, నిర్మాణ పనులు, దుకాణాల ద్వారా విక్రయాలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ వీటిని సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించవచ్చని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అనుమతించిన పరిశ్రమలు, కార్యకలాపాలకు సంబంధించి తగిన మినహాయింపు ఇవ్వాలని సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను కలెక్టర్ కోరారు.

Tags: Permits up, 6pm, villages, rangareddy

Advertisement

Next Story

Most Viewed