అమెజాన్‌ సీఈఓ మళ్లీ భూమి మీదకు రావొద్దు..

by vinod kumar |
అమెజాన్‌ సీఈఓ మళ్లీ భూమి మీదకు రావొద్దు..
X

దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ రోదసి నుంచి మళ్లీ భూమి మీదకు రావొద్దని ఆన్‌లైన్‌లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై 33 వేలకు పైగా మంది సంతకం చేశారు. జెఫ్‌ బెజోస్‌ తన సోదరుడు మార్క్‌తో కలిసి జూలై 20న అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. సొంత సంస్థ ‘బ్లూ ఆరిజన్‌’ తొలిసారి చేపట్టబోయే మానవసహిత రోదసి యాత్రలో వీరిద్దరూ పాల్గొంటున్నారు. బెజోస్‌ మళ్లీ భూమికి తిరిగి రాకూడదని వేల మంది డిమాండ్‌ చేస్తున్నారు. ఇందు కోసం రూపొందించిన ఆన్‌లైన్‌ పిటిషన్‌లో పెద్ద ఎత్తున తమ సంతకాలతో మద్దతు తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed