- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకా కోసం కోట్లాట.. వెయ్యికి పైగా బారులు తీరిన జనం
దిశ, జగిత్యాల : కొవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు కోసం గురువారం జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా కేంద్రం వుండటంతో తెల్లవారుజాము నుండే సమీప గ్రామాల నుంచి యువకులు, వృద్ధులు, మహిళలు అధికంగా తరలివచ్చారు. సుమారు వెయ్యి మందికి పైగా జనం సెకండ్ డోస్ కోసం రావడంతో ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
అయితే, వారు కొవిడ్ నిబంధనలు పాటించక ఒకరిపై ఒకరు పడుతూ భౌతిక దూరం పాటించకపోవడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు చెప్పులు, సంచులు వరుసలో క్యూ లైన్‌లో పెట్టారు. అయితే, రెండవ డోస్‌కు సెంటర్లు లేక ఈ పరిస్థితి ఏర్పడిందని, వ్యాక్సిన్ సెంటర్లు పెంచితే ఎవరికి ఇబ్బంది ఉండదని, వెంటనే సెంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.