- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జింక మాంసం అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో: కృష్ణ జింకలను వేటాడి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ శాఖ (జూపార్క్) అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఫిమేల్ జింకతో పాటు మరో జింక తల, కాళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం చాటా గ్రామానికి చెందిన చావన్ శంకర్ బాబా (36) జింకలు, మాంసం విక్రయించేందుకు మధ్యవర్తిత్తం వహించే జుబేర్‌తో పరిచయం ఏర్పడింది. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌కు చెందిన సల్మాన్ ఆసక్తి చూపడంతో జుబేర్ శంకర్‌ను కలిశాడు. దీంతో రెండు జింకలను వేటాడిన శంకర్.. జుబేర్‌కు సమాచారం అందించాడు. దీంతో నిజామాబాద్‌కు వెళ్లి శంకర్ నుంచి బతికున్న జింకతో పాటు జింక మాంసం (తల, కాళ్లు) రూ. 7 వేలకు కొనుగోలు చేసి సల్మాన్‌కు జుబేర్ రూ.15 వేలకు విక్రయించాడు.
సమాచారం తెలుసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అటవీ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. క్యూరేటర్ సుభద్రాదేవి మాట్లాడుతూ జింకలను వేటాడిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు చంద్రమోహన్, శ్రీశైలం, ఎండీ తాఖుద్దీన్, నరేంద్రనాథ్ పాల్గొన్నారు.