- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేమెంత కట్టడి చేసినా జనం ఆగడం లేదు: విజయవాడ సీపీ
తామెంత కట్టడి చేస్తున్నా ప్రజలు యధేచ్ఛగా రోడ్ల మీదకి వస్తున్నారని, ఇదే రెడ్‌జోన్లు పెరగడానికి కారణమవుతోందని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. రెడ్‌జోన్ల పరిధిలోని ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని, పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా సాధ్యం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కృష్ణా జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయన్న ఆయన, విజయవాడలో ఆరు రెడ్ జోన్లు ఉన్నాయని చెప్పారు. రెడ్‌జోన్లలోని ఆంక్షలను ఆయన పరిశీలించారు. ఇక్కడికే కదా అన్న ఉద్దేశ్యంతో యధేచ్ఛగా తిరిగేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీరే కరోనా వాహకాలుగా మారిపోతున్నారని ఆయన తెలిపారు. పోలీసులు ఎంత గట్టినిఘా పెట్టినా ఇంటర్నల్‌గా ప్రజలు కట్టడి పాటించడం లేదని ఆయన చెప్పారు.
బయట వ్యక్తులను లోపలకు అనుమతించక పోయినా లోపల ఉన్న వారి కారణంగానే సమస్య పెరుగుతోందని ఆయన చెప్పారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రెడ్‌జోన్ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. మరోవైపు ఎవరైనా బయటకు వస్తే వాహనాల్లో పోలీసులు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.
రెడ్‌జోన్లలో విధులు నిర్వహించే పోలీసుల వ్యక్తిగత భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, వారికి రక్షణకు పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు వంటి పరికరాలు అందజేస్తున్నామని ఆయన చెప్పారు.
Tags: andhrapradesh, corona virus, vijayawada police, vijayawada cp, dwaraka tirumalarao