వారి వల్లే నేను ఇలా ఉన్నా.. బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

by Shyam |   ( Updated:2021-11-23 23:13:32.0  )
bramhanadam
X

దిశ, వెబ్‌ డెస్క్: లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం మన జీవితంలో భాగమయ్యారు. బ్రహ్మీ ఈ తరం కమెడియన్ కానప్పటికి ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలలో కూడ తనకంటూ ఓ గుర్తింపు ఉంది. అతను ఎక్కువ సినిమాలు ప్రస్తుతం చేయకపోయినా, తన ముఖంతో సృష్టించే వివిధ రకాలా మీమ్స్, జిఫ్‌ల ద్వారా మన మొబైల్‌లలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటున్నాడు.

ఈ బ్రహ్మీ ఎమోజీల కోసం ప్రత్యేక అభిమానుల టీమ్‌లే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ వ్యక్తి స్వయంగా దాని గురించి మాట్లాడాడు. తాజాగా ఓ టీవీ షోలో మాట్లాడుతూ.. ఈ మీమ్ మేకర్స్ తనను రోజూ వార్తల్లో ఉంచుతున్నందుకు వారికి ధన్యవాదాలు అని చెప్పాడు. మీమ్స్ లేకపోతే ఈ రోజుల్లో తనను ఎవరూ గుర్తు పట్టే వారు కాదు అని బ్రహ్మీ చెప్పారు.

bramhanandam

Read more : మహేష్‌తో ప్లాన్ చేశా.. కానీ బాలయ్యతో చేస్తున్నా: అనిల్ రావిపూడి

Advertisement

Next Story