- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామాజిక దూరం… ససేమిరా మారం!
దిశ, మహబూబ్‌నగర్: ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యానికి గజగజ వణికిపోతోంది. భారత్ కూడా భయపడుతోంది. ఈ మహమ్మారి కోవిడ్ -19 కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే, ఈ వైరస్ నిరోధించేందుకు ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. ఈ వ్యాధికి మందు లేదనీ, ప్రజలందరూ సహకరించాలని ఇతరులనూ చైతన్య పరచాలని కోరుతున్నాయి. కాని తెలంగాణలోని పాలమూరు జిల్లాలో మాత్రం కరోనా చైతన్యం పూర్తిగా లేదని స్పష్టమవుతోంది. పోలీసులు, ప్రభుత్వం సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా ప్రజలు మేమింతే..మేము..ఎవరు చెప్పినా మారం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.
కనీస జాగ్రత్తలూ..
సరుకులు, కూరగాయల కొనుగోలు కోసం వెళ్లిన సమయంలో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడంలేదు. సామాజిక దూరం (సోషల్ డిస్టెన్స్) పాటించాలని చెప్పినా కిరాణా షాపులు, కూరగాయల మార్కెట్ల వద్ద అది కనబడటం లేదు. ప్రజలు ఎగబడి మరీ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. షాపుల యజమానులూ దీని పై దృష్టి సారించడం లేదు. ఉదయం 9 గంటలలోపే ప్రజలందరూ ఒకేసారి కొనుగోలుకు బయటకి రావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటుందని పలువురు అంటున్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చదువు రాకున్నా ఈ వైరస్ తీవ్రతను గుర్తించి, వారిలో వారు అవగాహన పెంచుకుని సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారనీ, కాని సిటీ ప్రజలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే, పోలీసులు, అధికారులు ప్రజలకు చైతన్యం కల్పించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలనీ, అప్పుడు తప్పక డిస్టన్స్ పాటిస్తారని పలువురు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇంట్లోనే ఉంటున్నారనీ, ఆ తర్వాత కూడా అవసరమైతేనే బయటకు వస్తున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే, సిటీలో కొంత భిన్న పరిస్థితులు నెలకొన్నాయనీ, సిటీలో లాక్ డౌన్ అమలుకు కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని అభిప్రాయపడుతున్నారు.
Tags : coronavirus (covid-19), affects, people, social distance, negligence