- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ కాళ్లు మొక్కుతా.. పనులు చేయండి.. కమిషనర్ కాళ్లు పట్టుకున్న ప్రజలు
దిశ, వేములవాడ : అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఉన్న కాలనీలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలిచిన కాలనీల అభివృద్ధిలో అధికారులు వివక్ష చూపుతున్నారని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. మున్సిపాలిటిలోని అన్ని కాలనీలను సమాన దృష్టితో చూసి అభివృద్ధి చేయాలని వేములవాడ మున్సిపాలిటీలోని 15వార్డు కాలనీ ప్రజలు బుధవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
చివరకు అభివృద్ధి కోసం మున్సిపల్ కమిషనర్ కాళ్లు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, చేయని పనులకు బిల్లులు ఆమోదం పొందేందుకు సాధారణ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. విపక్ష కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపిస్తూ అభివృద్ధికి నిధులు కేటాయిండం లేదన్నారు.
హిందువుల పండుగల ఏర్పాట్లలో మున్సిపల్ పాలక వర్గం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పట్టణంలో అక్రమ కట్టడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. లే అవుట్ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని, పట్టణ నడిబొడ్డున సీసీ రోడ్ డ్రైనేజీలు లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మున్సిపల్‌లో విలీన గ్రామాల సమస్యలు పట్టించుకోవడంలేదని, అధికారుల తీరులో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున్న ఆందోళనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా 15వ వార్డు బీజేపీ అభ్యర్థి కావడంతో అభివృద్ధి చేయడం లేదని కాలనీ ప్రజలు కమిషనర్ కాళ్ళు మొక్కారు.
- Tags
- legs