- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాయం చేయడానికి వేదిక ‘ఫ్రీట్రీ’
దిశ, వెబ్ డెస్క్: ఒకరికి ఇవ్వడంలో ఉన్న సంతృప్తి..ఒకరికి సాయం చేయడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ దొరకదు. మనం బాగున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా బాగా చూసుకోవాలనుకుంటాం. మన దగ్గర కాస్త ఎక్కువ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్లకు దాన్ని పంచాలనుకుంటాం. అదే మానవత్వపు లక్షణం. మంచితనానికి నిదర్శనం. మొన్న లాక్‌డౌన్‌లో అది నిరూపితమైంది. ఇటీవల వరదల వేళ అది కొనసాగింది. కొన్నిచోట్ల అది నిత్యకృత్యంగా వర్ధిల్లుతోంది. బల్గేరియా, హంగేరిలో ‘ఫ్రీ ట్రీ’ కాన్సెప్టు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
మనుషులందరికీ కూడు, గూడు, గుడ్డ తప్పనిసరి. గూడు లేని వాళ్లకు కనీసం కూడు, గుడ్డ అయితే, కావాలి కదా. అందుకే బల్గేరియా, హంగేరిలతోపాటు చాలా దేశాల్లో ‘ఫ్రీ ట్రీ’ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ఆ మధ్యకాలంలో పాపులర్ అయినా ‘కైండ్‌నెస్ వాల్’లానే ఇది కూడా. ఫుడ్, క్లాత్స్, ఇంకేవైనా వస్తువులను ‘ఫ్రీ ట్రీ’ అనే చెట్టుకు హ్యాంగ్ చేస్తే అటు వైపు వెళ్లే పేదలు, అత్యవసరమున్న ఎవరైనా వాటిని తీసుకెళ్లొచ్చు. గతేడాది బెంగళూరులో కూడా ఈ ‘ఫ్రీ ట్రీ’ కాన్సెప్ట్ ఫాలో అయ్యారు చాలా మంది బెంగళూరు వాసులు. గత చలికాలంలో స్వెట్టర్లు ఆ చెట్టుకు తగిలించారు. అవసరమైన పేదలు వాటిని తీసుకెళ్లారు. అంతేకాదు ఆ చెట్టు దగ్గర ఎక్కువ మొత్తంలో స్వెటర్లు పోగవడంతో బెంగళూరులో ఈ ఇన్షియేట్ ప్రారంభించిన రాజరాజేశ్వరి నగర్ రెసిడెంట్స్ ఫోరం (ఆర్ఆర్ఎఫ్) వాళ్లు ఫుట్‌పాత్, ఇతర ప్రాంతాల్లో ఉండే పేదలకు ఆ స్వెట్టర్లను, దుప్పట్లను ఇచ్చి వచ్చారు.
ఫ్రీ ట్రీ కాన్సెప్టు మొదట ఆస్ట్రేలియాలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మళ్లీ వింటర్ వస్తున్న నేపథ్యంలో నెటిజన్లు ‘ఫ్రీ ట్రీ’ కాన్సెప్టును సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. సాయం చేయాలని తపన చాలా మందిలో ఉంటుంది. కానీ, తమ దగ్గర డబ్బుల్లేవని బాధ పడుతుంటారు. ‘ఫ్రీ ట్రీ’ కాన్సెప్టుకు డబ్బు అవసరం లేదు. ఎవరైనా దీన్ని తమ వీధిలో స్టార్ట్ చేయొచ్చు. దానం చేసే వారు, సాయం చేయాలనుకున్నవాళ్లు ఆ ఫ్రీ ట్రీకి తగిలిస్తారు. మనం దాన్ని అవసరమైన వారికి చేరిస్తే చాలు. గొప్ప సాయం చేసినట్లే అవుతుంది. ఉదాహరణకు నలుగురు తినడానికి బిర్యానీ ఆర్డర్ చేస్తారు. కానీ, అందరూ తిన్నా కూడా ఇంకా అక్కడ చాలా మిగిలి పోతుంది. దాన్ని అలానే పార్సిల్ చేయించి.. ‘ఫ్రీ ట్రీ’ కి హ్యాంగ్ చేశారనుకుందాం. అది ఆకలితో ఉన్న వారికి మనం వెళ్లి అందిస్తే.. వారి కడుపు నిండుతుంది. ఫ్రీ ట్రీ కాన్సెప్టుకు న్యాయం జరుగుతుంది. సాయం చేస్తున్నామనే సంతృప్తి దక్కుతుంది.