- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
దిశ, మేడ్చల్: అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న సంఘటన సోమవారం మేడ్చల్ జిల్లాలో జరిగింది. మేడ్చల్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని అకోలా కు చెందిన పెంటా చౌహన్ గంజాయి విక్రయాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అకోలాకు గంజాయి తీసుకువచ్చేందుకు స్థానికంగా కరణ్ నానా జాదవ్, దేవ్ కి చౌహాన్, హిందూ మోహితే, ఉషా చౌహన్ లతో ఒప్పందం కుదుర్చుకుని రూ.5 వేలు రవాణా ఖర్చులకు ఇచ్చాడు. దీంతో ఈ నెల 1వ తేదీన అకోలా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం చేరుకుని విశాఖపట్నంకు చెందిన పంగి మల్లేక్ వద్ద 62.595 కిలోల గంజాయిని 30 బ్యాగులలో వేసుకున్నారు. నిందితులు అకోలా గంజాయి తరలిస్తూ.. ఈ నెల 12న మార్గ మద్యలోని మేడ్చల్‌కు చేరుకున్నారు. మేడ్చల్ హైవే మీదుగా వెళ్తుండగా బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్ కు తరలించారు.